
కలువాయి (ప్రజావాణి జూన్ 30) నక్సలైట్ల కాల్పుల్లో అమరుడైన కలువాయి గ్రామవాసి అన్నకర్ల కేశవులు గారి 16వ వర్ధంతి సభ స్థానిక బస్టాండ్ సెంటర్ నందు గల అమరవీరుల స్థూపం దగ్గర అత్యంత ఘనంగా జరిగింది. కేశవులు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రమేష్ మరియు వారి సిబ్బందితో పాటు కేశవులు తల్లిదండ్రులు చిన్నయ్య, పెంచలమ్మ, కుటుంబ సభ్యులు కేశమ్మ, శ్రీదేవి, పెంచలరావు, నాగేశ్వరరావు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం కేశవులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, ఆయన పోలీస్ విభాగానికి మరియు గ్రామానికి ఎనలేని కీర్తి తెచ్చారని ఎస్సై రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరజీవి కేశవులును స్మరించుకున్నారు.




