📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyఓటు హక్కును ప్రతి పౌరుడు కాపాడుకోవాలి ఎక్స్ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

ఓటు హక్కును ప్రతి పౌరుడు కాపాడుకోవాలి ఎక్స్ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*ఓటు హక్కును ప్రతి పౌరుడు కాపాడుకోవాలి*

– *ఎక్స్ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి*
షాద్ నగర్ ప్రజావాణి జూన్ 29:
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును కాపాడుకోవాలని ఎక్స్ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, రాజకీయ పక్షపాతం లేకుండా సవరణ ప్రక్రియను నిర్వహించాలని కోరారు. ప్రతి గ్రామం, వార్డు, బూత్ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి సరిదిద్దుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి అర్హుడి ఓటు కీలకమని, అందరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి పునరుద్ఘాటించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular