📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఅన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం

అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 15 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద వరంగల్ హైవేపై నూతనంగా నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజీవ్ గృహ కల్ప, సత్యసాయి నగర్ కాలనీ వాసులు కలిసి గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం పార్లమెంట్‌లో తన గళం వినిపించి ప్రాజెక్ట్‌కు ఆమోదం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ ఈటల రాజేందర్‌కు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి, సంబంధిత అధికారులతో నిరంతరం చర్చిస్తూ, రాజీవ్ గృహ కల్ప ప్రాంత ప్రజలు రోడ్డు దాటే సమయంలో ఎదుర్కొంటున్న ప్రమాదాలను వివరించి అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టుదలతో కృషి చేసిన మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోంగళ్ళ బాలేష్, సత్యసాయి నగర్ కాలనీ అధ్యక్షులు కృష్ణ గౌడ్, జీహెచ్ఎంసీ బీసీ సంఘం ఉపాధ్యక్షులు కె. సతీష్, స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు రావుల శ్రీకాంత్, బాలు యాదవ్, గుండె నరేష్, మధనయ్య భారత్ రెడ్డి, బండారి మహేష్, బాబు కుమార్, దాసి రాజేష్, గుర్రం అనిల్, రుత్విక్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular