📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialభావితరాల భవిష్యత్తుపై మొక్కలు నాటండి  

భావితరాల భవిష్యత్తుపై మొక్కలు నాటండి  

📰 Generate e-Paper Clip

*భావితరాల భవిష్యత్తుపై మొక్కలు నాటండి*

 

*జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్*

 

*కాసీపేట 2 గనిపై మెగా ప్లాంటేషన్ కార్యక్రమం* 

*2వేల మొక్కలు నాటిన డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఏరియా జిఎం రాధాకృష్ణ*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 30 

 

భావితరాల బంగారు భవిష్యత్తు కొరకు మొక్కలు నాటడమే మార్గమని జిల్లా అటవీ శాఖ అధికారి (డిఎఫ్ఓ) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం ఏరియా పరిధిలోని కాసీపేట 2 గని ప్రాంగణంలో గురువారం మెగా ప్లాంటేషన్(విస్తృత మొక్కల పెంపకం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, బెల్లంపల్లి ఎఫ్డిఓ విజయ్ కుమార్, బెల్లంపల్లి ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్, మంచిర్యాల ఎఫ్డిఓ సర్వేశ్వరరావు లు ముఖ్యఅతిథులుగా హాజరై, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సింగరేణి ఉద్యోగులు ముఖ్యంగా మహిళ కార్మికులు అత్యంత ఉత్సాహంతో ముందుకు వచ్చి, మొక్కలు నాటడంలో భాగస్వాములు కావడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఒక్క మొక్కను నాటడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అని తెలిపారు. పచ్చదనం జీవకోటికి ప్రాణాధారమని, మారుతున్న వాతావరణ మార్పులు తట్టుకోవాలన్నా, కాలుష్య రహిత వాతావరణాన్ని భావితరాలకు అందించాలన్నా, ప్రతి ఒక్కరు తమ ఇంట్లో, పని ప్రదేశాల్లో మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వర్షపు వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకే రోజు 2వేల మొక్కలు కాసీపేట 2గనిపై నాటడం అభినందనీయమని తెలిపారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాలతో పాటు పర్యావరణ సమతుల్యత కోసం ఈ ఏడాది 8 హెక్టార్ల సిఏ, సింగరేణిలో ఖాళీగా ఉన్న స్థలాలలో మొత్తం 1,80,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా సింగరేణి పరిధిలోని 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలను పక్కాగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ఒక్క సంస్థకో, ప్రభుత్వానికో పరిమితం కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అనంతరం ఏరియాలోని కేకే ఓసీపీ లోని సిఏ లాండ్స్ ను డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, కాసీపేట 2 గని మేనేజర్ బారపాటి రమేష్, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, ఏఐటియుసి గని పిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్, గని సంక్షేమ అధికారి భార్గవ్, ఏరియా, జిఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular