మాల కమ్యూనిటీకి సంబంధించిన భూమి కబ్జా యత్నం
రామగిరి,జులై 30
రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో కమ్యూనిటీ కి చెందిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో పట్టా పొంది మా పూర్వీకుల నుండి సంక్రమించిన మా భూమిని అక్రమ కబ్జా చేయాలని చూస్తున్నారని, ఆ భూమి తమదని అన్నారు.మాల కమ్యూనిటీ కులస్తులు మాట్లాడుతూ…మాలల భూమి తనదంటూ అనేక అడ్డంకులు సృష్టిస్తున్న కొందరికి రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేయించుకొని హద్దులు ఏర్పాటు చేసుకోవాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని డిమాండ్ చేయడం జరిగింది.మా తాతల కాలం నుండి మాకు మాల కమ్యూనిటీకి సంక్రమించిన భూమిని,నకిలీ ధృవ పత్రాలతో పట్టా చేయించుకుని,మమ్మల్నే మా భూమిలో ఏం చేయకుండా ప్రతిసారి అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని అన్నారు.
ఈ భూ వివాదంలో రాజకీయాలకు తావులేదు. అనవసరంగా ఈ వివాదాన్ని రాజకీయ రంగు పులిమి రాజకీయ నాయకులను అభాసు పాలు చేయడం తగదని అన్నారు.ఈ భూమి రాజకీయ పార్టీల నాయకుల భూమి కాదని కేవలం మా భూమి మాకంటూ చేస్తున్న మాలల పోరాటమని గుర్తించాలన్నారు.
అంబేడ్కర్ వారసులం అని చెప్పుకునే చెప్పుకొని తిరిగే సదరు నాయకులే ఇలా మాల కమ్యూనిటీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే సమంజసం కాదని,అలా చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమం లో మాల సంఘం కుల సభ్యులు అందరు పాల్గొన్నారు.




