బద్వేలు జూలై 19 ప్రజావాణి నియోజకవర్గం,బద్వేలు మండలం,తిరువెంగళపురంలో గ్రామ పంచాయతీ లో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి,ఉమ్మడి కడప డీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గ్రామ ప్రజలు ఆహ్వాన మేరకు వచ్చిన టిడిపి ఇంచార్జి,కి మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో,వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బిజివేముల జగన్ మోహన్ రెడ్డి తో పాటు 40 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాయి.వారికి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికి బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఆహ్వానం పలుకుతున్నారు.పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు,ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.పార్టీలో చేరిన కుటుంబాలు టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని,ప్రజా సేవలో ముందుండి పార్టీ విజయానికి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బద్వేలు మండలం, తిరువెంగళపురంలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలో చేరిక
RELATED ARTICLES




