కాశినాయన జూలై 19 ప్రజావాణి మండల పరిధిలోని సావిశెట్టిపల్లె గ్రామంలో ఆదివారం నాడు పండుగ వాతావరణం సంతరించుకుంది.గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని,తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆర్.సూర్యనారాయణ రెడ్డి,కాశినాయన మండల సీనియర్ టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డితో కలిసి సావిశెట్టిపల్లె గ్రామంలో విస్తృతంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు.
ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, గ్రామస్థులు
దేవాలయ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సూర్యనారాయణ రెడ్డి,కర్నాటి వెంకటరెడ్డిలకు గ్రామ సరిహద్దుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బాణసంచా కాలుస్తూ,మంగళ వాయిద్యాలు,బ్యాండ్ మేళాల మధ్య భారీ కేరింతలతో నాయకులను గ్రామంలోకి ఊరేగింపుగా ఆహ్వానించారు.కార్యకర్తలు తమ ప్రియతమ నేతలపై పూలవర్షం కురిపిస్తూ, జై తెలుగుదేశం అంటూ చేసిన నినాదాలతో సావిశెట్టిపల్లె మార్మోగింది.ఈ పర్యటనలో భాగంగా నాయకులు ఇద్దరూ కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా,గ్రామంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడి ఇంటికి కాలినడకన వెళ్లారు.స్థానిక నేతలు సుబ్బారెడ్డి,మల్లేష్ నాయుడుల ఆధ్వర్యంలో దాదాపు 20కి పైగా కుటుంబాల ఇళ్లను నేరుగా సందర్శించారు.పార్టీ శ్రేణుల కుటుంబ సభ్యులను, వారి బంధుమిత్రులను,ఆత్మీయులను పలకరిస్తూ దేవాలయ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంట్లోనూ వారితో కలిసి ముచ్చటిస్తూ పండుగ సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు. నేతలే స్వయంగా తమ ఇళ్లకు రావడంతో ఆయా కుటుంబాల్లో అంతులేని సంతోషం వ్యక్తమైంది.నాయకుల పర్యటనపై సావిశెట్టిపల్లె గ్రామ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.కడప డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి,మండల నేత కర్నాటి వెంకటరెడ్డి తమ గ్రామానికి రావడం,ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి ధైర్యాన్ని,సంతోషాన్ని నింపడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ పర్యటన స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని,నూతన ఉత్తేజాన్ని నింపిందని,రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కట్టుబడి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు.

గ్రామ పర్యటన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రముఖులు,నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రామనికి సూర్యనారాయణ రెడ్డి,వెంకటరెడ్డి,చెరుకూరి రవి,ఓబులాపురం రాజశేఖర్,రాఘవేందర్ రెడ్డి,సురేష్,సుధాకర్,లక్కిరెడ్డి రామ్మోహన్ రెడ్డి,నారాయణరెడ్డి,బిజెపి నాయకులు భాస్కర్ రెడ్డి,మరియు మనోహర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.హాజరయ్యారు.అక్కడ స్థానిక నాయకులతో కలిసి భోజనం చేస్తూ,గ్రామ పరిధిలోని పలు సమస్యలపై,పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




