కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ప్రొద్దుటూరు పోలీసు అంటే భయం కాదు.బాధ్యత అని నిరూపిస్తున్నారు ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ.నేరస్తుల పట్ల కఠినంగా ఉండటం ఒక ఎత్తయితే,వారిని సంస్కరించి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా మార్చడం మరో ఎత్తు.ఈ దిశగా అడిషనల్ ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాలు,చూపిస్తున్న ఆప్యాయత ఇప్పుడు రూరల్ పరిధిలో హాట్ టాపిక్ గా మారాయి.ఆప్యాయతతో మార్పుకు శ్రీకారం ఇవాళ సాయంత్రం రూరల్ పరిధిలోని పాత నేరస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ ఎస్పీ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.సాధారణంగా నేరస్తులంటే గద్దించడం,బెదిరించడం వంటివి చూస్తుంటాం.కానీ, ఆయన వారిని అత్యంత మర్యాదపూర్వకంగా పలకరించారు.ఎవరెవరిపై ఏయే సెక్షన్ల కింద కేసులు ఉన్నాయో వివరంగా అడిగి తెలుసుకుంటూనే.గతం గతః.ఇకపై మీ ప్రవర్తన సమాజం పట్ల,మీ ప్రాంతం పట్ల బాధ్యతగా ఉండాలి. అని తండ్రిలా హితబోధ చేశారు.నేరస్తుల మనసులో చెదరని ముద్ర అడిషనల్ ఎస్పీ మాటలు విన్న నేరస్తుల హృదయాల్లో కొత్త ఆలోచన మొదలైంది.గతంలో పోలీసు వ్యవస్థ అంటే భయం వేసేది,కానీ ఇప్పుడు మమ్మల్ని మనుషులుగా గౌరవించి మాట్లాడే అధికారిని చూడటం మా అదృష్టం.అంటూ వారు తమలో తాము చర్చించుకోవడం విశేషం.. పోలీసుల పట్ల వారిలో ఉన్న వ్యతిరేకత పోయి,ఒక తెలియని గౌరవం ఏర్పడింది.రూరల్ టీమ్ పనితీరుకు ప్రశంసలు కేవలం అడిషనల్ ఎస్పీ గారే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న రూరల్ సీఐ నాగభూషణం,ఎస్సై శ్రీకాంత్, అందిస్తున్న సహకారం అమోఘమని స్థానికులు కొనియాడుతున్నారు.సీఐ నాగభూషణం.నేరాల అదుపులోనూ,శాంతిభద్రతల పరిరక్షణలోనూ అనుభవజ్ఞుడైన అధికారిగా తనదైన ముద్ర వేస్తున్నారు.ఎస్సై శ్రీకాంత్.యువ అధికారిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అటు ఉన్నతాధికారుల ఆదేశాలను,ఇటు ప్రజల అవసరాలను సమన్వయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.బలమైన నేరాలు చేసిన వ్యక్తులు సైతం ఇప్పుడు తమ పాత మార్గాన్ని వీడి, మంచి ప్రవర్తనతో జీవించాలని నిర్ణయించుకోవడం ఈ అధికారుల పనితీరుకు నిదర్శనం.నరస్తుల మనసులో మార్పు తీసుకురావడమే నిజమైన విజయమని,ప్రొద్దుటూరు పోలీసులు నిరూపిస్తున్నారు. పోలీసు వ్యవస్థలో వస్తున్న ఈ.మానవీయ మార్పు.పట్ల రూరల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
పోలీసు..మార్పు..మంత్రం.. నేరస్తుల మనసు గెలిచిన ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ..!
0
5
RELATED ARTICLES
- Advertisment -
