పోలీసు..మార్పు..మంత్రం.. నేరస్తుల మనసు గెలిచిన ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ..!
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ప్రొద్దుటూరు పోలీసు అంటే భయం కాదు.బాధ్యత అని నిరూపిస్తున్నారు ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ.నేరస్తుల పట్ల కఠినంగా ఉండటం ఒక ఎత్తయితే,వారిని సంస్కరించి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా మార్చడం మరో ఎత్తు.ఈ దిశగా అడిషనల్ ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాలు,చూపిస్తున్న ఆప్యాయత ఇప్పుడు రూరల్ పరిధిలో హాట్ టాపిక్ గా మారాయి.ఆప్యాయతతో మార్పుకు శ్రీకారం ఇవాళ సాయంత్రం రూరల్ పరిధిలోని పాత నేరస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ ఎస్పీ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.సాధారణంగా నేరస్తులంటే గద్దించడం,బెదిరించడం వంటివి చూస్తుంటాం.కానీ,...