📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyపారిశుద్ధ్య కార్మికుడు పై దాడి

పారిశుద్ధ్య కార్మికుడు పై దాడి

📰 Generate e-Paper Clip

*చిన్న ఉమ్మెత్యాల గ్రామంలో**  *పారిశుధ్య కార్మికుడు బ్యాగరి యాదయ్య దాడి…..**
*తీవ్ర రక్త గాయాలతో ఉన్నా  పారిశుధ్య కార్మికుడిని మెరుగైన. వైద్యం కోసం ఉస్మానియాకు తరలింపు*

షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు07 :

షాద్ నగర్ నియోజకవర్గం లోని
కొందుర్గుమండల పరిధిలోని   చిన్న ఉమ్మెంత్యాల గ్రామ పంచాయతీ గ్రామపంచాయతీ లో  చెత్త సేకరణ వాహనానికి అడ్డంగా నిలిపిన ప్రక్క వ్యక్తి వాహనాన్ని కొద్దిగా పక్కకు తీయాలని పారిశుధ్య కార్మికుడు బ్యాగరి యాదయ్య కోరినందుకు పారిశుద్ధ్య కార్మికుడిపై  కబీర్ బుషయ్యా    కబీర్ వీరేశం అను వ్యక్తులు  దాడి చేసి  కార్మికుడు తల పగల  గొట్టిన ఘటన ఉమ్మెంత్యాల గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, గ్రామపంచాయతీ చెత్త సేకరణ వాహనం విధులు నిర్వహిస్తుండగా దారికి అడ్డంగా ఒక వాహనం నిలిపి ఉండటంతో, దానిని కొద్దిగా సైడ్‌కు తీసుకోవాలని డ్రైవర్‌ను పారిశుద్ధ్య కార్మికుడు కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన సంబంధిత వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిపై దాడికి పాల్పడినట్లు ఈ దాడిలో కార్మికుడికి తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇంతటి అగత్యానికి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  విడి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular