*
* *డాక్టర్ విజయలక్ష్మి*
షాద్‌నగర్ ప్రజావాణి ఆగస్టు 07: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర హెచ్ఐవీ/ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్* జయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని **ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ICTC)**ను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ICTC ల్యాబ్‌లో గర్భిణులు, సాధారణ రోగులకు నిర్వహిస్తున్న హెచ్ఐవీ పరీక్షల విధానాన్ని పరిశీలించి, పరీక్షల నిర్వహణ, రిపోర్టుల నమోదు తదితర అంశాలపై ల్యాబ్ టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చే ప్రతి గర్భిణికి తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష నిర్వహించాలని సూచించారు.
హెచ్ఐవీ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను గోప్యంగా ఉంచాలని, సంబంధిత వ్యక్తికి మాత్రమే సమాచారం అందించాలని డాక్టర్ జయలక్ష్మి సూచించారు. గర్భిణుల్లో హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించిన సందర్భంలో సకాలంలో తగిన చికిత్స అందిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ICTC కౌన్సిలర్ శ్యామ్‌తో మాట్లాడిన ఆమె రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నెలవారీ కన్సాలిడేషన్ రిపోర్టులను రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులకు ప్రతినెలా మందులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి, అర్హులైన ప్రతి పాజిటివ్ కేసుకు నిరంతరం మందులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఆఫ్‌లైన్ రిజిస్టర్లతో పాటు ఆన్లైన్లో HIMS పోర్టల్‌లో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, మంత్లీ టూర్ రిజిస్టర్‌ను నిర్వహించాలని సూచించారు. అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించి అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్షలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, రంగారెడ్డి జిల్లా హెచ్ఐవీ ప్రోగ్రాం మేనేజర్ నరేందర్, సూపర్వైజర్ రమేష్, ICTC కౌన్సిలర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవీ/ఎయిడ్స్ జాయింట్ డైరెక్టర్ తనిఖీ
RELATED ARTICLES




