పట్టణ పరిధిలోనీ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి గుంతల మరమ్మతులు చేపించిన
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు,పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ దగ్గరుండి మరి గుంతల మరమ్మతు పనులను చేపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం వర్తక,వాణిజ్య వ్యాపార నిలయం కాబట్టి పట్టణానికి అనునిత్యం వచ్చివెల్లే వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలను నివారిస్తూ ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలనే ఉద్దేశంతో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేశాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్,కౌన్సిలర్లు ఫిరోజ్,కొలుగూరి సురేష్,మంద రాజేష్ తదితరులు పాల్గొన్నారు
రహదారి గుంతలు మరమ్మత్తులు చేపించిన మున్సిపల్ చైర్మన్
RELATED ARTICLES




