📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyవిధినిర్వహణలలో ఉన్నా పారిశుధ్య కార్మికుడిపై దాడి ఘటనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి

విధినిర్వహణలలో ఉన్నా పారిశుధ్య కార్మికుడిపై దాడి ఘటనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

*విధినిర్వహణలలో ఉన్నా పారిశుధ్య కార్మికుడిపై దాడి ఘటనలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి*

*నీకంటే ముందుగా నిద్రలేచి నిస్వార్ధంగా గ్రామ సేవా చేస్తున్న*  **పారిశుధ్య కార్మికుల పై దాడి చాలా సిగ్గు చేటైన చర్య…**



*వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య…**
*
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 07:
రంగారెడ్డి లోని షాద్ నగర్ నియోజక వర్గంలో నీ కొందుర్గు మండల పరిధిలో గల చిన్న ఉమ్మెత్తల గ్రామపంచాయతీ పరిధిలో నేడు చాలా అమానవీయ ఘటన చోటు చేసుకుంది అయితే గ్రామంలో పారిశుధ్య కార్మికుడీగా పనిచేస్తున్న  బ్యాగరి యాదయ్య పై అకారణంగా దాడి  చేశారు అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వారు కబీర్ భూషయ్యా కబీర్ వీరేశంల నేడు ఉదయం గ్రామ చెత్తను  ట్రాక్టర్లో  యాదయ్యా  కొద్ది దూరం వెళ్లాక గ్రామ రోడ్లకు అడ్డంగా  మరో వాహనం నిలిచి ఉన్నందున  మీ వాహనాన్ని కొంచెం ప్రక్కకు తీయండి అని అడిగిన యాదయ్యా ను వారు  తీవ్రంగా తాడి చేసి తల పగల  గొట్టారు.. ఈ సంఘటనపై స్పందించిన  తెలంగాణ వ్యవసాయ.కార్మిక సంఘం నాయకులు బుద్ధుల జంగయ్య  వారికి అండగా నిలిచి  స్థానిక కొందుర్గ్ పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేస్తూ నిందితులపై కట్టిన చర్యలు తీసుకోవాలని కోరారు

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోనేడు కార్మికుల.జీవితం దిన దిన జీవితం  అదిరింపుకు బెదిరింపుల పర్వంగా దండగుతుందని  ఎవరి మాట వినకున్న దాడికి దిగుతూ  దౌర్జన్యాలు చేస్తున్నారు అని ఆయన అన్నారు
గ్రామపంచాయతీలు పరిశుభ్రంగా ఉంటాయని వారే లేకుంటే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని అది గమనించుకోవాల్సిన అవసరం గ్రామీణ ప్రజానీకానికి ఎంతైనా ఉందని ఆయన సూచించారు అధికారులు కూడా పంచాయతీ కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అది మానుకోవాలని అధికారులు నాయన కోరారు ముట్పూర్ గ్రామంలో కూడా పంచాయతీ కార్మికుడు ముక్కిడి శీను పై ఇలాంటి ఘటననే జరిగిందని పంచాయతీ పరిధిలో మాట్లాడి పరిష్కరించారని ఆయన పోలీసుల దృష్టికితీసుకువచ్చారు పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ పనులు చేయడానికి ఉన్నారు కానీ వ్యక్తిగతమైన పనులు చేయడానికి కాదు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు

*ఇక మీదట గ్రామ పంచాయితీ  కార్మికులపై ఎలాంటి దాడిని  జరిగిన సహించేది లేదు..*

మరోసారి పంచాయతీ కార్మికులపై దాడులు చేసిన దౌర్జన్యం చేసిన తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు బ్యాగరీ యాదయ్య
జిపి యూనియన్ మండల అధ్యక్షులుతలపై బలమైన గాయం అయిందని ఆయన కోల్కోడానికి సమయం పడుతుందని కావున కోల్కు కున్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులు యాదయ్యకు సెలవుతో కూడినవేతనంతో
పాటు వైద్య ఖర్చులు అన్నీ కూడా భరించాలని ఆయన డిమాండ్ చేశారు  గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కొందుర్గు మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో
స్థానిక పోలీస్ స్టేషన్లో జందార్ శ్రీనివాస్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది..

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి భాగాల నరసింహ జిపియూనియన్ మండల గౌరవ అధ్యక్షులు గోపి గడ్డ యాదయ్య మండల ప్రధాన కార్యదర్శి పామిడి జంగయ్య ప్రచార కార్యదర్శి చింతలపల్లి జంగయ్య ఉపాధ్యక్షులు సి యాదయ్య ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular