* రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా డి ఎ పి అందించాలి యూరియా షాపుల ద్వారానే పంపిణీ చేయాలి
* జమ్మికుంటలో ఇసుక క్వారీలు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి
* పక్క నియోజకవర్గలలో ఆన్లైన్ లేకుండానే ట్రాక్టర్లకు అనుమతులు
* హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు కేసులు
* తనుగుల చెక్‌డ్యామ్‌ను వెంటనే పూర్తి చేయాలికాల్వల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి
* కన్నెపల్లి పంపులు ప్రారంభించి తాగుసాగునీటి సమస్య పరిష్కరించాలిఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట ఆగస్టు 7 (ప్రజావాణి)
జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు సర్పంచులతో విస్తృత స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంనిర్వహించారుమండలంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వ్యవసాయం మిషన్ భగీరథ విద్య వైద్యం విద్యుత్ సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలనిసూచించారుయూరియాను యాప్ ద్వారా కాకుండా నేరుగా ఎరువుల షాపుల ద్వారా రైతులకు అందించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే డి ఎ పిను ఇతర ఎరువులతో లింక్ చేయకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారుజమ్మికుంటలో ఇసుక క్వారీలు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితిపక్క నియోజకవర్గలలో అనుమతులు ఇస్తూ ఇక్కడ ట్రాక్టర్లపైకేసులుఎందుకుజమ్మికుంట మండలంలో ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన ఇసుక దొరకని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పెద్దపల్లి, మానకొండూర్ ప్రాంతాల్లో ఆన్లైన్ లేకుండానే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్నారని, మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో ట్రాక్టర్లపై ఎందుకు కేసులు పెడుతున్నారని అధికారులనుప్రశ్నించారుప్రజలకు, రైతులకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాక్టర్ యజమానులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా స్పష్టమైన విధానం అమలు చేయాలనిఎమ్మెల్యేకోరారుఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలిజమ్మికుంట మండలంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని సర్పంచులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులకు ఆయిల్‌పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారుప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలనిపిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలనిసూచించారుతనుగుల చెక్‌డ్యామ్‌ను వెంటనే పూర్తి చేయాలితనుగుల చెక్‌డ్యామ్ తెగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారువెంటనే చెక్‌డ్యామ్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులనుఆదేశించారుజమ్మికుంట మండల ప్రజలకు కూడా ఎంతో అవసరమైన కాల్వల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎలాంటి ప్రభావం లేకుండా కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి తాగు, సాగునీటిని అందించాలని కోరుతూ సమావేశంలోతీర్మానంచేశారుప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతపైఎమ్మెల్యేఆగ్రహంజమ్మికుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీ, షుగర్ వంటి సాధారణ మందులు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని రకాల అవసరమైన మందులను అందుబాటులో ఉంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని వైద్యఅధికారులనుకోరారుగెలిచి ఏడు నెలలు అయినా ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని వైద్య అధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదని సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్ర అసంతృప్తివ్యక్తంచేశారుఅధికారులు వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదనిహెచ్చరించారు12 గంటల విద్యుత్ ఇస్తూ 24 గంటలు ఇస్తున్నామని చెప్పడం సరికాదువిద్యుత్ సరఫరాపై కూడా ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అధికారులు 12 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుందని అబద్ధాలు చెప్పడం సరికాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారుమిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలిమిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారుగ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలనిసూచించారుప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారఈ కార్యక్రమం లో ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు సర్పంచ్‌లు పాల్గొన్నారు





