📄 ePaper
Sunday, July 19, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipet"గాగిల్లాపూర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అదనంగా రూ.10 లక్షల మంజూరు" ఎమ్మెల్యే...

“గాగిల్లాపూర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అదనంగా రూ.10 లక్షల మంజూరు” ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మొదట మంజూరైన రూ.10 లక్షలతో పనులు పూర్తి కాకపోవడంతో, ఆ విషయాన్ని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మరో రూ.10 లక్షలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ, గ్రామ పాఠశాల విద్యార్థుల భద్రత, విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే చూపుతున్న చిత్తశుద్ధి అభినందనీయమని అన్నారు. అదనపు నిధుల మంజూరుతో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కావడానికి మార్గం సుగమమైందని తెలిపారు.
గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular