సావిశెట్టిపల్లె జూలై 19 ప్రజావాణి గ్రామంలో భక్తిభావం,ఐకమత్యం వెల్లివిరిశాయి.సావిశెట్టిపల్లె గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన దేవాలయ ప్రతిష్టా మహోత్సవం విజయవంతంగా ముగిసి 21 రోజులు పూర్తి అయిన సందర్భంగా,గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఘన కృతజ్ఞతా విందు కార్యక్రమం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగింది.స్థానిక నేతలు, ప్రముఖులు మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సావిశెట్టిపల్లె మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు.ఈ ఘన కృతజ్ఞతా విందు కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ రాజకీయ నాయకులు, ముఖ్య అతిథులుగా విచ్చేశారు.బద్వేల్ టిడిపి ఇన్‌చార్జ్ మరియు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ ఆర్.సూర్యనారాయణ రెడ్డి ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారితో పాటు ప్రముఖ నాయకులు చెరుకూరి రవి,ఓబులాపురం రాజశేఖర్,రాఘవేందర్ రెడ్డి,సురేష్ యాదవ్,సుధాకర్,లక్కిరెడ్డి రామ్మోహన్ రెడ్డి,నారాయణరెడ్డి,బిజెపి నాయకుడు భాస్కర్ రెడ్డి, మరియు మనోహర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.గ్రామ పెద్దలు వీరందరినీ శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచే దేవాలయంలో ప్రత్యేక పూజలు,హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవం జరిగిన నాటి నుండి నియోజకవర్గానికి,గ్రామానికి అంతా మంచి జరగాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని అర్చకులు ప్రత్యేక మంగళహారతులు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.ప్రతిష్టా మహోత్సవాలను ఒక యజ్ఞంలా భావించి,రాత్రింబగళ్లు శ్రమించి విజయవంతం చేసిన ప్రతి ఒక్క గ్రామస్తుడికి,మరియు దాతలకు ఈ సందర్భంగా నిర్వాహకులు,నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గ్రామంలోని కులమతాలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఈ విందు మహోత్సవంలో పాల్గొన్నారు.విందుకు విచ్చేసిన భక్తులకు,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని వసతులను అద్భుతంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.సావిశెట్టిపల్లె ప్రజల ఐక్యత,భక్తిభావం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.దేవాలయ కార్యక్రమాలు సమాజంలో శాంతిని,సద్భావాన్ని పెంపొందిస్తాయని ఆకాంక్షించారు.సావిశెట్టిపల్లె చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన ఈ కృతజ్ఞతా విందు కార్యక్రమం, ప్రజల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరియు ఐకమత్యాన్ని చాటిచెప్పింది.
Homeఎడిటోరియల్సావిశెట్టిపల్లెలో వైభవంగా poleramma ప్రతిష్టా మహోత్సవ 21 రోజుల విందు:బ్రహ్మరథం పట్టిన ప్రజలు
సావిశెట్టిపల్లెలో వైభవంగా poleramma ప్రతిష్టా మహోత్సవ 21 రోజుల విందు:బ్రహ్మరథం పట్టిన ప్రజలు
0
3




