📄 ePaper
Thursday, April 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కొడవటికల్లు గ్రామంలో 8వ పోషణ పక్వాడా

కొడవటికల్లు గ్రామంలో 8వ పోషణ పక్వాడా

📰 Generate e-Paper Clip

 

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం లో అంగన్వాడి సెంటర్ నందు 15ఏప్రిల్ 2026 బుధవారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/04/2026 నుండి23/04/2026 వరకుఈ కార్యక్రమాలు నిర్వహించ బడుచున్నవి. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0నుండి 3 సంవత్సరాల పిల్లలమెదడు అభివృద్ధి చెందటము మరియు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆట ఆధారిత విద్యా అలాగే సామాజ పాత్ర, మరియు జంక్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు స్క్రీన్( సెల్ ఫోన్లు టీవీలు ) అందుబాటులో ఉంచకపోవడం మొదలగు అంశాల గురించి ఐ సి డి సి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ సూపర్వైజర్ పి . శ్రీలత వారికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ఐ సి డి ఎస్ సూపర్వైజర్స్ పి శ్రీలత, అంగన్వాడి వర్కర్స్ పి .పిచ్చమ్మ,తల్లిదండ్రులు, అమ్మమ్మలు నాయనమ్మలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular