📄 ePaper
Thursday, April 16, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliఎండ తీవ్రత నేపథ్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్‌లో మజ్జిగ పంపిణీ

ఎండ తీవ్రత నేపథ్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్‌లో మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

  • ఎండ తీవ్రత నేపథ్యంలో సెంటినరీ కాలనీ మార్కెట్‌లో మజ్జిగ పంపిణీ

రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 15

రామగిరి మండలం సింగరేణి సెంటినరీ కాలనీ అంగడిలో వర్తకులు,ప్రజలకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు శ్రీ సత్యసాయి భజన మండలి,కల్వచెర్ల ఆధ్వర్యంలో నూక రమేష్ నాయకత్వంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సత్యసాయి సేవాదళ్,లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అలాగే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ముఖ్యంగా ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం,అవసరం లేకపోతే మధ్యాహ్న సమయంలో ఎండలో బయటకు వెళ్లకపోవడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం వంటి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ హన్మంతరావు,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల మారుతి యాదవ్,శరణ్య యాదవ్, సత్యసాయి ఆధ్యాత్మిక సమన్వయకర్త రాజేశం, భాస్కర్,గరిగంటి రాజయ్య, మారుతి,లక్ష్మీనారాయణ, వాణి,రాజలక్ష్మి,శరణ్య,ఉమ, బండి సత్యనారాయణ ఎస్.ఓ,జిఎం,ఎఎల్ పి అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికీ స్వామి వారి అనుగ్రహం నిండుగా ఉండాలని నిర్వాహకులు ప్రార్థించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular