📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జిల్లా ఇన్చార్జి మంత్రి & రాష్ట్ర వెనుకబడిన తరగతులు,బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి...

జిల్లా ఇన్చార్జి మంత్రి & రాష్ట్ర వెనుకబడిన తరగతులు,బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి శ్రీమతి ఎస్.సవిత

📰 Generate e-Paper Clip

వై ఎస్ ఆర్ కడప,ప్రజావాణి జూన్ 17) రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సాధనతో పాటు.. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో, సమిష్టిగా పాటుపడాలని.జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర వెనుకబడిన తరగతులు,బలహీన వర్గాల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు.బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో.రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారసులుగా ఉన్న అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా తుడిచి పెట్టే లక్ష్యంతో.అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు.జిల్లా లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు.అందుకు అనుగుణంగా.అధికారులు క్షేత్రస్థాయిలోబాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా నడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రక్షాళన చేస్తున్నారన్నారు. ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధన కు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో ప్రజలకు అందిస్తూనే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తోందని..జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.రెండేళ్ల సుపరిపాలనలో. అభివృద్ధి,సంక్షేమం,ప్రజలకు పారదర్శక పాలన ను అందించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అందుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం దిశగా వైఎస్ఆర్ కడప జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేద్దామన్నారు.రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా స్థాయి లో సక్రమంగా,విజయవంతం గా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు.ప్రభుత్వంలో భాగస్వాములైన జిల్లా కలెక్టర్ నుంచి అధికారులు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై.అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి.ప్రజా ప్రతినిధులు,అధికారులు ఇరువురూ సమన్వయంతో పనిచేసి పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నారు.ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా స్వీకరించి వారి వివరాలను నమోదు చేయాలన్నారు.స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న 10 సూత్రాల పురోగతిని, వైఎస్సార్ కడప జిల్లాలో ప్రాధాన్యతా రంగాల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలు, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలపై జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితకు క్షుణ్ణంగా వివరించారు. 2025-26 ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లా స్థూల జిల్లా ఉత్పత్తి విలువ (GDDP) రూ.79,627 కోట్లు కాగా, రాష్ట్రంలో 8వ స్థానంలో ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లా స్థూల విలువ జోడింపు (GVA) రూ.73,405 కోట్లు నమోదైందన్నారు. జిల్లాలో తలసరి ఆదాయం రూ.2,83,734 ఉండగా, రాష్ట్రంలో 12వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.ఆర్థిక వ్యవస్థలో సేవారంగం అత్యధికంగా రూ.28,212 కోట్లతో 38.43 శాతం, పరిశ్రమల రంగం రూ.23,830 కోట్లతో 32.46 శాతం, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు రూ.21,363 కోట్లతో 29 శాతం వాటా కలిగి ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.జిల్లాలో పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగాలు సమతుల్యంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర–2047 విజన్ కింద జిల్లాను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం రూ.79 వేల కోట్ల స్థాయిలో ఉన్న జిల్లా ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి రూ.13.26 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. అలాగే ప్రస్తుతం రూ.2.83 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల ద్వారా 15 శాతానికి పైగా వార్షిక వృద్ధితో రూ.34 లక్షలకు పెంచే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వివరించారు.2026-27 సంవత్సరానికి జిల్లా మొత్తం GVA లక్ష్యం రూ.84,482 కోట్లు, GDDP లక్ష్యం రూ.91,606 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా రూ.23,908 కోట్లు, పరిశ్రమల ద్వారా రూ.27,821 కోట్లు, సేవారంగం ద్వారా రూ.32,753 కోట్లు సాధించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారత లో 29,224 స్వయం సహాయక సంఘాలు, 2.86 లక్షల మహిళా సభ్యులు, రూ.2,355.90 కోట్ల జీవనోపాధి ప్రణాళిక, రూ.1,323.29 కోట్ల రుణ ప్రణాళిక అమలవుతున్నట్లు తెలిపారు. మత్స్యరంగంలో రూ.300.25 లక్షల సబ్సిడీ, 511 లైసెన్సులు, 538 పెన్షన్ లబ్ధిదారులు, పట్టణాభివృద్ధిలో రూ.52.78 కోట్లతో 520 టన్నుల సామర్థ్య మౌలిక వసతుల నిర్మాణం కొనసాగుతున్నట్లు వివరించారు.జిల్లా ఆర్థిక వృద్ధి లో ప్రధానంగా ఉద్యానవనం, గనులు, తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, రవాణా, రియల్ ఎస్టేట్, సేవారంగం కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమ, స్టార్టప్ కడప, పారిశ్రామిక పార్కులు, ఉద్యాన పంటల ఎగుమతులు,నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్‌లో జిల్లా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయన్నారు.ఈ విధంగా పోషకాహారం, వ్యవసాయం,జల సంరక్షణ, పరిశ్రమలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, మహిళా సాధికారత, ఉపాధి, మత్స్యరంగం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి 10 సూత్రాల అమలులో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.జిల్లాను “ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సెంటర్” గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే కడప కలెక్టరేట్లో “ఇన్వెస్ట్ కడప సెంటర్” ను ఏర్పాటు చేసి జిల్లాలో పెట్టుబడులకు ముందుకొచ్చే ఇన్వెస్టర్లకు ప్రత్యేకమైన సూచనలు,సలహాలు,మార్గదర్శకాలను అందిస్తూ.. పెట్టుబడుల ప్రారంభం నుండి ఆదాయాన్ని పొందేవరకు కూడా.ఒక జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో ముందుకు సాగనుందన్నారు. స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహార భోజనం అందించేందుకు జిల్లాలో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 5 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తుండగా, మరో 33 కిచెన్లు ఏర్పాటు చేసి మొత్తం 38 కిచెన్ల ద్వారా జిల్లాలోని 1,778 పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,00,091 మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించే ప్రణాళికను వివరించారు.ఇందుకోసం 95 వాహనాలు,112 డెలివరీ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.స్టార్టప్ –ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ జిల్లాలో యువతకు ఉపాధి,స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ తెలిపారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ద్వారా 50కి పైగా స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం లభించడంతో పాటు రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించేందుకు, 500 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. జూన్ 2026 నాటికి కేంద్రం ప్రారంభానికి సిద్ధమవుతోందని పేర్కొన్నారు.2026-27 సంవత్సరానికి వ్యవసాయ,అనుబంధ రంగాల్లో రూ.23,908 కోట్ల స్థూల విలువ జోడింపు (GVA) సాధించే లక్ష్యంతో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్-2026 సీజన్‌కు జిల్లాలో 76,496 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 4,908 హెక్టార్లలో విత్తనాలు వేశారని కలెక్టర్ వివరించారు. రైతులకు యాంత్రీకరణ పరికరాల పంపిణీ,సబ్సిడీ విత్తనాల సరఫరా, ప్రకృతి వ్యవసాయం,పంటల బీమా,అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల అమలు పురోగతిని వివరించారు. జిల్లాలో 1.94 లక్షల మంది రైతులకు రూ.388 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.ఉద్యానవన రంగం జిల్లాలో 70,888 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని,సీతాఫలం, అరటి, మామిడి, నిమ్మ, దానిమ్మ,ఉల్లి, టమాట తదితర పంటల ద్వారా సంవత్సరానికి 23 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి లభిస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.MIDH, RKVY పథకాల ద్వారా రూ.1,617 కోట్ల లక్ష్యంతో తోటల అభివృద్ధి, నీటి వనరుల సృష్టి, యాంత్రీకరణ, మార్కెటింగ్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. సూక్ష్మ సాగునీటి పథకాలు, అధిక విలువ కలిగిన పంటల ప్రోత్సాహం, పంటల విస్తరణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.పశుసంవర్థక, పాల ఉత్పత్తి, మత్స్యరంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీ పరికరాలు,నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, ప్రకృతి వ్యవసాయం, రైతు భరోసా–పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి వనరులు జిల్లా లోని గండికోట,పైడిపాలెం,వెలిగల్లు, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 47.18 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. రైతులకు సాగునీరు అందించేందుకు వివిధ కాలువల ద్వారా నీటి విడుదల షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలిపారు.పరిశ్రమలు–పెట్టుబడులు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తూ కొత్త పరిశ్రమల స్థాపన,పెట్టుబడుల ఆకర్షణ,యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. తయారీ రంగం, మైనింగ్,నిర్మాణ రంగాల ద్వారా జిల్లాలో పరిశ్రమల వాటా రూ.27,821 కోట్లకు చేరిందని వివరించారు.నైపుణ్యాభివృద్ధి–ఉపాధి యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణలు అందిస్తూ ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్టార్టప్ కడప, పరిశ్రమల అనుసంధానం,నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.గ్రామీణాభివృద్ధి – సంక్షేమం డ్వామా,డీఆర్‌డీఏ,మెప్మా, ఉపాధి హామీ పథకం,సామాజిక భద్రతా పింఛన్లు, మహిళా సాధికారత కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.విద్య – వైద్యం పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త భవనాల నిర్మాణం, ప్రహరీ గోడలు, అదనపు తరగతి గదుల ఏర్పాటు,సమగ్ర శిక్ష కార్యక్రమాల పురోగతిని వివరించారు. అలాగే ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నిర్మాణం, వైద్య సేవల విస్తరణ, ఆరోగ్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్షకు నివేదిక సమర్పించారు.ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో వివిధ రహదారుల విస్తరణ, బలోపేతం, వంతెనల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జాతీయ రహదారి–67 (కడప–రాయచోటి–చెన్నై కారిడార్), ఎన్‌హెచ్–40 (కర్నూలు–కడప–చిత్తూరు మార్గం), ఎన్‌హెచ్–340 రహదారుల విస్తరణ, ఫోర్‌లేనింగ్ భూసేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.జిల్లాలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై రూ.1,000 కోట్లకు పైగా విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటివల్ల పారిశ్రామిక రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని వివరించారు.అలాగే జిల్లాలోని ప్రధాన రహదారుల ద్వారా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమ, పారిశ్రామిక పార్కులు, వ్యవసాయ మార్కెట్లు జాతీయ రహదారులతో అనుసంధానమవుతున్నాయని,దీంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గనున్నాయన్నారు.గ్రామీణ నీటిసరఫరా వ్యవస్థ ద్వారా.. జిల్లాలో మొత్తం 2,666 గ్రామీణ ఆవాసాలు, 617 గ్రామ పంచాయతీలు, 3,477 పీడబ్ల్యూఎస్/ఎంపీడబ్ల్యూఎస్ పథకాలు, 18 సీపీడబ్ల్యూఎస్ పథకాలు, 8,094 హ్యాండ్ పంపులు ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రత్యేకంగా 193 తాగునీటి పనులు రూ.73.77 కోట్ల అంచనా వ్యయంతో మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వీటిలో అత్యధికంగా రాజంపేట నియోజకవర్గంలో 103 పనులు రూ.33.25 కోట్లతో, జమ్మలమడుగులో 44 పనులు రూ.20.42 కోట్లతో చేపడుతున్నట్లు వివరించారు. అలాగే పులివెందుల నియోజకవర్గానికి రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలవుతుండగా, మొత్తం 227 నీటి నిల్వ నిర్మాణాల్లో 213 పూర్తయ్యాయి. దాదాపు 1,169 కిలోమీటర్ల పైప్‌లైన్ పనుల్లో 1,089 కిలోమీటర్లకు పైగా పూర్తయ్యాయి.జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)ను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంత్రి సవితకు వివరించారు. జిల్లాలో మొత్తం 1,379 ఫెయిర్ ప్రైస్ షాపులు ఉండగా, వీటిలో 1,338 ఆన్‌లైన్ షాపులు పనిచేస్తున్నాయి. జిల్లాలో 6,59,288 బీపీఎల్ రైస్ కార్డులు, అందులో 6,18,560 పీహెచ్‌హెచ్ కార్డులు, 40,728 అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డులు ఉన్నాయని తెలిపారు. అలాగే 14 ఎంఎల్‌ఎస్ పాయింట్లు, 59 గ్యాస్ ఏజెన్సీలు, 215 పెట్రోల్ బంకులు సేవలు అందిస్తున్నట్లు వివరించారు.రీ సర్వే కి సంబంధించి.. జిల్లాలో మొత్తం 802 గ్రామాలు ఉండగా, మున్సిపాలిటీల్లో విలీనమైన 53 గ్రామాలు, జలాశయాల్లో మునిగిన 39 గ్రామాలను మినహాయించి 710 గ్రామాలు రీసర్వేకు అనుకూలంగా గుర్తించారు. వీటిలో ఇప్పటికే 379 గ్రామాల్లో రీసర్వే పూర్తికాగా, మరో 202 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 129 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాల్సి ఉంది.రీసర్వే ద్వారా జిల్లాలో మొత్తం 41.18 లక్షల సర్వే నంబర్లలో 41.00 లక్షలకుపైగా సర్వే రికార్డులు ధృవీకరణ పూర్తి కాగా, వేలాది మంది రైతులకు డిజిటల్ భూ రికార్డులు, నవీకరించిన సరిహద్దు వివరాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. భూ వివాదాల పరిష్కారం, ఖచ్చితమైన భూ హక్కుల నమోదు, నూతన పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.గృహ నిర్మాణ శాఖకు సంబంధించి.. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 98,374 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయగా, 50,352 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 48,022 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, మొత్తం పురోగతి 49 శాతంగా నమోదైంది. ఇందుకోసం ఇప్పటివరకు రూ.1,328.92 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు.అలాగే పీఎంఏవై (అర్బన్) 2.0 కింద జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 1,918 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయగా, 1,784 ఇళ్లు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయి. వీటిలో 1,223 ఇళ్లు నిర్మాణ పనులు ప్రారంభమై 68.6 శాతం పురోగతి సాధించాయి. ఇప్పటివరకు రూ.480.5 లక్షలు లబ్ధిదారులకు చెల్లించినట్లు కలెక్టర్ వివరించారుఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్,జమ్మలమడుగు శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి,జేసి డా.నిధి మీనా, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు శాసనసభ్యులు నంద్యాల వరద రాజుల రెడ్డి, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన,డిఆర్ఓ మల్లికార్జునుడు, జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, పలు కార్పోరేషన్ ల డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular