నెక్కొండ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం
రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞ
నెక్కొండ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం
చెన్నారావుపేట ఏప్రిల్ 15 ప్రజావాణి
మండల కేంద్రంలోని ప్రధాన రహదారి జంక్షన్లో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో నెక్కొండ సిఐ శ్రీనివాస్ చెన్నారావుపేట ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ – నో హెల్మెట్, నో ఎంట్రీ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ…మారుతున్న కాలానికి అనుగుణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎస్ఐ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని కోరారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పోలీసు సిబ్బందితో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించబోమని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని అందరూ కలిసి శపథం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పాపమ్మ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రషీద్,సిద్ధార్థ పాఠశాల వ్యవస్థాపకుడు కంది గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు,పోలీస్ సిబ్బంది గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.




