జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కళ్యాణ లక్ష్మి మరియు రూ.31.03 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానికంగానే చెక్కులు అందిస్తున్నామని, త్వరలోనే మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం జగదేవ్ పేట గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన ఈత వనాన్ని పరిశీలించి గౌడన్నలకు ప్రభుత్వ సాయం అందిస్తామని, బైపాస్ రోడ్డు, కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
వెల్గటూర్ లో లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ చేసిన అడ్లూరి
0
4
Previous article



