ఈరోజు కొండాపూర్ కు విచ్చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఉపసర్పంచ్‌ల చెక్కు పవర్ యధావిధిగా కొనసాగించాలని, ఉపసర్పంచ్‌లకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేల గౌరవ వేతనం అందించాలని, శిలాఫలకాలపై పేర్లు ఉండేలా చూడాలని కోరుతూ ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కార్యదర్శి మేరుగు జంపన్న, జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, కన్వీనర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపసర్పంచ్‌ల సమస్యలపై మంత్రి సానుకూల స్పందన
0
6



