📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriజాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్*

జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్*

📰 Generate e-Paper Clip

*జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్*

*రేగొండ, ఏప్రిల్ 16:*

జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్* భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే దిశగా మరో అడుగు పడింది. జాతీయ స్థాయి మూగ క్రికెట్ పోటీలకు ఎంపికై, క్రీడా రంగంలో రాణిస్తున్న *పసుల రాజు* ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌ను రేగొండ *సబ్ ఇన్‌స్పెక్టర్ డి. సుధాకర్* బుధవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ గారు రిబ్బన్ కట్ చేసి, కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యాన్ని అధిగమించి, పట్టుదలతో జాతీయ స్థాయికి ఎదిగిన పసుల రాజు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని, వారికి ఇలాంటి ప్రాక్టీస్ పిచ్‌లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో పెద్దంపల్లి సర్పంచ్ గడ్డె రఘు, ఉప సర్పంచ్ సకినాల రవీందర్,రేగొండ BRS టౌన్ యూత్ అధ్యక్షులు మాడగాని నరేష్ మరియు, క్రీడా అభిమానులు రాజును ఘనంగా సన్మానించారు .ఈ ప్రాక్టీస్ పిచ్ అందుబాటులోకి రావడం పట్ల స్థానిక క్రికెట్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular