📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన - మేయర్ బుర్రి చైతన్య...

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన – మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  1. *ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన – మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*

*స్వదేశీ (ఇండీ) కుక్క పిల్లల దత్తత కార్యక్రమానికి శ్రీకారం*

*మహిళల సంక్షేమం, సిరిసిల్ల నేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*నల్లగొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్’ లో భాగంగా మహిళా సంఘ సభ్యులు, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన స్థానిక మహిళా ఓటర్ల కు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నేడు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మే 29 నుండి జూన్ 3, 2026 వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో సంబంధిత డివిజన్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి వార్డులో చీరల పంపిణీ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా వార్డుల వార్డ్ ఆఫీసర్లు, సంబంధిత డివిజన్ కార్పొరేటర్ల సమన్వయంతో అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘ సభ్యులు మరియు అర్హులైన మహిళా ఓటర్లు తమ వార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలకు వెళ్లి చీరలను స్వీకరించాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ ద్వారా మహిళలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగడంతో పాటు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా పారదర్శకంగా పంపిణీ నిర్వహించాలని తెలిపారు. అనంతరం స్వదేశీ (ఇండీ) కుక్క పిల్లల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వదేశీ జాతి కుక్కల సంరక్షణకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దత్తత తీసుకున్న వారు కుక్క పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి, వాటి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ, స్వదేశీ జాతి కుక్కల ప్రత్యేకతలు, వాటి సంరక్షణ, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జూన్ 3 వ తేదీ వరకు ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా సంబంధిత డివిజన్ కార్పొరేటర్లు, వార్డ్ ఆఫీసర్ల సమన్వయంతో చీరలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల వద్ద చీరలను స్వీకరించాలని కోరారు. అదే విధంగా, నగరంలో స్వదేశీ (ఇండీ) జాతి కుక్కల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన దత్తత కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. దత్తత తీసుకున్న వారు కుక్క పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి, వాటి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పశు సంక్షేమం, ప్రజారోగ్య పరిరక్షణ మరియు నగర పరిశుభ్రత లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు ఆలకుంట్ల నాగరాజు, మామిడి కార్తీక్, పెరిక స్వాతి, గోగుల గణేష్, అల్లి సుభాష్ చంద్రబోస్, గుండెబోయిన పుష్పలత, కేసాని వేణుగోపాల్ రెడ్డి, అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, మేప్మా టీఎంసీ శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అనిల్ కుమార్, జ్యోతి, రాజా, నరసింహ, ఆర్‌పీలు, మహిళా సంఘ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 720 మంది మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular