📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్

వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్

📰 Generate e-Paper Clip

వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్

-​సర్పంచ్ పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27

వేములపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
​అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్
సర్పంచ్ పదవి అనేది ఎవరో పెట్టిన భిక్ష కాదని, భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని వేములపల్లి గ్రామ సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా గురువారం వేములపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా సర్పంచ్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే నేడు తెలంగాణలో వేలాది మంది గ్రామాలకు ప్రథమ పౌరులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీలలో 2,537 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండగా, అక్కడ సర్పంచ్ పదవులు పూర్తిగా ఎస్టీలకు కేటాయించబడ్డాయన్నారు. మిగిలిన 10,223 నాన్-షెడ్యూల్డ్ పంచాయతీల్లో బీసీలకు 2,186 స్థానాలు (21.39 శాతం) రిజర్వు అయ్యాయని వివరించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లతో పాటు అన్‌రిజర్వ్‌డ్ స్థానాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు గ్రామ పాలనలో సమన్యాయం జరిగిందన్నారు.
​ఆత్మపరిశీలన చేసుకోవాలి:
రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన సర్పంచులు రాజ్యాంగాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు, అధికారాలు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. “సర్పంచులుగా మనం అనుభవిస్తున్న అధికారాలు నిజంగా మనవేనా? లేక ఇతరులపై ఆధారపడి పనిచేస్తున్నామా? మన పదవీకాలంలో పంచాయతీలను బలోపేతం చేసి భవిష్యత్ తరాలకు ఏం అందించబోతున్నాం?” అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాలనా వ్యవస్థలో ఇంతకాలం ప్రాతినిధ్యం లేని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.
​కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాజూరి శ్రీకాంత్, వార్డు సభ్యులు నారాయణ మంగమ్మ, మాతంగి సుధీర్, ABR యూత్ అధ్యక్షుడు పుట్టల మధు, కార్యదర్శి రమణపల్లి సంజయ్, లైన్‌మెన్ లచ్చయ్య, పగడాల చందు, బదనకటి శంకర్, బచ్చలకూరి కోటేష్, రీగన్, పుట్టల సైదులు, ఎస్‌కే పాషా, ఎస్‌కే సయ్యద్, ధైర్య సైదులు, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
​

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.