📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరివర్ హాస్పిటల్స్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్‌కు విశేష స్పందన

రివర్ హాస్పిటల్స్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్‌కు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

రివర్ హాస్పిటల్స్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్‌కు విశేష స్పందన

200 మందికి పైగా పరీక్షలు.. 20 మందిలో కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యల గుర్తింపు

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27

మిర్యాలగూడ,
రివర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత యూరాలజీ, కిడ్నీ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాలగూడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా ప్రజలు శిబిరంలో పాల్గొని వివిధ రకాల కిడ్నీ పరీక్షలు చేయించుకున్నారు.
సాధారణంగా రూ.5 వేల వరకు ఖర్చయ్యే CBC, RFT, CT KUB వంటి కీలక పరీక్షలతో కూడిన ప్రత్యేక ట్రిపుల్ నైన్ స్క్రీనింగ్ ప్యాకేజీని కేవలం రూ.999కే అందించడం విశేషం.
ఈ పరీక్షల్లో సుమారు 20 మందిలో వివిధ రకాల కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలు ప్రాథమికంగా గుర్తించారు. కిడ్నీలో రాళ్లు, మూత్రనాళంలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, మూత్రనాళ సంకుచితం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలను గుర్తించిన వైద్యులు బాధితులకు తగిన వైద్య సలహాలు, సూచనలు అందించారు.
శస్త్రచికిత్స అవసరమైన వారికి అర్హత, సంబంధిత అనుమతులకు లోబడి EHS, ESI, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాలను వివరించారు.
కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచించారు. ప్రజల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు నాణ్యమైన వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా రివర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గ్రీడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి నెలా మూడవ గురువారం రివర్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక ట్రిపుల్ నైన్ కిడ్నీ స్క్రీనింగ్ క్యాంప్నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని మిర్యాలగూడ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్యాంప్ విజయవంతానికి సహకరించిన వైద్యులు, సిబ్బంది, పాల్గొన్న ప్రజలకు హాస్పిటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
రివర్ హాస్పిటల్స్ – మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.