📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి నడిబొడ్డున నరకప్రాయం: కొర్లగుంట జంక్షన్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.మున్సిపల్ అధికారుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’వైఖరిపై ప్రజాగ్రహం!

తిరుపతి నడిబొడ్డున నరకప్రాయం: కొర్లగుంట జంక్షన్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.మున్సిపల్ అధికారుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’వైఖరిపై ప్రజాగ్రహం!

📰 Generate e-Paper Clip

తిరుపతి టౌన్:నవంబర్ 25ప్రజావాణి ఆధ్యాత్మిక నగరంగా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన తిరుపతి నడిబొడ్డున పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తిరుపతి జిల్లా తిరుపతి టౌన్‌లోని అత్యంత కీలకమైన కొర్లగుంట జంక్షన్ దగ్గర డ్రైనేజీ పూర్తిగా బ్లాక్ అయ్యి, మురుగునీరు రోడ్లపైకి తన్నేస్తోంది.చిన్న పాటి వాన పడితేనే పరిస్థితి ఇంత గందరగోళంగా మారుతుంటే, ఇక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు, వాహనదారులు,వ్యాపారులు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కళ్లుండి చూడనట్లు,ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.చిన్న వానకే చెరువులవుతున్న రోడ్లు. షాపుల్లోకి మురుగునీరు!కొర్లగుంట జంక్షన్ పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.పూడికతీత పనులు సరిగ్గా చేపట్టకపోవడం, ప్రణాళికారహితంగా డ్రైనేజీ లైన్లు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి.మురుగునీరు రోడ్లపై మోకాళ్ళ లోతున ప్రవహిస్తుండటంతో కాలినడకన వెళ్లే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఉన్న గుంతలు,మురుగునీటి ప్రవాహాన్ని దాటలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా,మురుగునీరు రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి, వ్యాపార సముదాయాల్లోకి చేరడంతో వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరంలో,అదీ అత్యంత రద్దీగా ఉండే కొర్లగుంట జంక్షన్‌లో ఈ దారుణమైన పరిస్థితి ఉండటం సిగ్గుచేటు”అని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.అధికారుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’వైఖరి.. ఏం చేస్తున్నారు?ఈ సమస్యపై స్థానికులు ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు, వార్డు సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు కేవలం తాత్కాలికంగా వచ్చి చూసి వెళ్లడమే తప్ప,శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. చిన్న వానకే ఈ స్థాయిలో గందరగోళం ఉంటే,రాబోయే రోజుల్లో భారీ వర్షాలు లేదా తుఫానులు వస్తే తిరుపతి పరిస్థితి ఏంటని? షాపులు, ఇళ్ళు నీట మునిగిపోవాల్సిందేనా? అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ సిటీ నిధులు,పన్నుల రూపంలో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ,కనీస డ్రైనేజీ సౌకర్యాన్ని కూడా ఎందుకు మెరుగుపరచలేకపోతోందని నిలదీస్తున్నారు.తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్కొ ర్లగుంట జంక్షన్ వద్ద బ్లాక్ అయిన డ్రైనేజీని వెంటనే క్లియర్ చేయాలని, ఆధునిక యంత్రాలతో పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.