తిరుపతి నడిబొడ్డున నరకప్రాయం: కొర్లగుంట జంక్షన్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.మున్సిపల్ అధికారుల ‘నిమ్మకు నీరెత్తినట్లు’వైఖరిపై ప్రజాగ్రహం!

తిరుపతి టౌన్:నవంబర్ 25ప్రజావాణి ఆధ్యాత్మిక నగరంగా, అంతర్జాతీయ గుర్తింపు పొందిన తిరుపతి నడిబొడ్డున పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తిరుపతి జిల్లా తిరుపతి టౌన్‌లోని అత్యంత కీలకమైన కొర్లగుంట జంక్షన్ దగ్గర డ్రైనేజీ పూర్తిగా బ్లాక్ అయ్యి, మురుగునీరు రోడ్లపైకి తన్నేస్తోంది.చిన్న పాటి వాన పడితేనే పరిస్థితి ఇంత గందరగోళంగా మారుతుంటే, ఇక భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు, వాహనదారులు,వ్యాపారులు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా, తిరుపతి నగరపాలక...