📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

మల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

📰 Generate e-Paper Clip

మల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం!

కార్తీక మాసం సందర్భంగా ఉసిరి దీపాలు వెలిగించిన భక్తులు – భక్తిశ్రద్ధలతో శివనామస్మరణ.

కొండాపూర్ నవంబర్24( ప్రజావాణి): మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఉన్న శివాలయం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో కొలువుదీరిన అరుదైన మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు శివలింగాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న మరకత శివలింగం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా మల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగం ఉండటంతో దాని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక మాసం పవిత్రతను పురస్కరించుకుని మహిళలు, భక్తులు ఉసిరి దీపాలను భక్తిప్రపత్తులతో వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆలయ పూజారి ఎల్లప్రగడ రఘువీర్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు ముందస్తు ఏర్పాట్లు చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
కార్తీక మాసంలో మరకత శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంతో మల్కాపూర్ శివాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.