మల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం

మల్కాపూర్ శివాలయంలో మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం! కార్తీక మాసం సందర్భంగా ఉసిరి దీపాలు వెలిగించిన భక్తులు – భక్తిశ్రద్ధలతో శివనామస్మరణ. కొండాపూర్ నవంబర్24( ప్రజావాణి): మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఉన్న శివాలయం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో కొలువుదీరిన అరుదైన మరకత శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు శివలింగాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ...