📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకప్పల కుంట కట్ట కబ్జాదారుల కబంధ హస్తాల్లో

కప్పల కుంట కట్ట కబ్జాదారుల కబంధ హస్తాల్లో

📰 Generate e-Paper Clip

కప్పల కుంట కట్ట కబ్జాదారుల కబంధ హస్తాల్లో!

నాసర్‌పుర కప్పల కుంట కట్టకు ఇష్టారాజ్యంగా వెలిసిన ఇళ్లు.. అధికార యంత్రాంగం నిద్రావస్థలోనా?

మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మౌనం వెనుక మర్మమేమిటి?

సిద్దిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి)
సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పుర ప్రాంతంలో ఉన్న కప్పల కుంట కబ్జాలకు గురవుతున్నా సంబంధిత ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కుంట కట్టను ఆనుకుని ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ వాటిని అడ్డుకోవడంలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చెరువులు, కుంటలు, వాటి కట్టలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నప్పటికీ, నాసర్‌పుర కప్పల కుంట విషయంలో మాత్రం ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కుంట కట్టపై నిర్మాణాలు పూర్తయినప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఒకవైపు ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు సిద్దిపేట పట్టణంలోనే కప్పల కుంట కట్ట ఆక్రమణలకు గురవుతోందనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కప్పల కుంటకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, కట్ట హద్దులు పరిశీలించి, ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు సంబంధించిన అనుమతులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకొని కుంట కట్టను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.కప్పల కుంట కబ్జాలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తారా? మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారా? లేక కుంట కట్ట కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోతుందా? వేచీ చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.