జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రకృతి సౌందర్యానికి నెలవైన ధౌలాధర్ హిమాలయ పర్వత శ్రేణుల సమీపంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ చాముండాదేవి శక్తిపీఠాన్ని కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం, ప్రజలందరి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు.
హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచే చాముండాదేవి అమ్మవారి ఆలయ దర్శనం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

