📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్మికులకు భద్రత కరువు

కార్మికులకు భద్రత కరువు

📰 Generate e-Paper Clip

కార్మికులకు భద్రత కరువు

* వ్యక్తిగత రక్షణ పరికరాలు లేని దుస్థితి
* గాలికి వదిలిన ఆరోగ్య భద్రత
* శిక్షణ,పని ప్రదేశ భద్రత కరువు
* భాద్యతలను విస్మరించిన యాజమాన్యం
* సేఫ్టీ గార్డులు లేని యంత్రాలు
* యాజమాన్య తీరుపై చట్టపరమైన చర్యలకు డిమాండ్

సిద్ధిపేట ప్రతినిధి నవంబర్ 24, ( ప్రజావాణి)
జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టీ క్షణ క్షణం విధులు నిర్వహిస్తున్న కార్మికులకు భద్రత కరువైంది.వివరాలలోకి వెళితే సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని మాచాపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న బయో మెడికల్ వ్యర్థాల సేకరణ,శుద్దీ కరణ కేంద్రంలో పని చేస్తున్న కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.సంగారెడ్డి,మెదక్, సిద్ధిపేట మూడు జిల్లాల నుండి వ్యర్థాలను సేకరిస్తున్న ధర్మ ఏజెన్సీ యాజమాన్యం కార్మికులకు కల్పించవలసిన భద్రత గాలికి వదిలి వేశారంటూ విమర్శలు వెలువడుతున్నాయి.పని చేసే కార్మికులకు సాధారణ కార్మికులకంటే ఎక్కువ భద్రత చర్యలు కల్పించాలి కానీ అవి ఏవీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.రక్తం, శరీర భాగాలు, సూదులు,మందుల వ్యర్థాలు,ఇన్ఫెక్షన్ కలిగించే వ్యర్థాలు రసాయనాలతో కార్మికులు పని చేయవలసి ఉంటుంది.వ్యర్థాలు శరీరానికి తగలకుండా ఉండే రక్షణ దుస్తులు ప్రొటెక్షన్ సూట్ , చేతులకు ఇన్ఫెక్షన్ రసాయనాల నుంచి రక్షించుకోవడానికి రబ్బరు గ్లౌజులు,కళ్ళకు ముఖానికి వ్యర్థాలు చిమ్మకుండా ఫేస్ షీల్డ్ , గాగుల్స్,ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఏరోసాల్స్ నుంచి రక్షణ కోసం మాస్కులు,కాళ్ళకు వ్యర్థాలు, కలుషిత ద్రవాలు తగలకుండా గంబూట్లు,శరీరం పై వ్యర్థాలు పడకుండా ఏప్రాన్ వంటి సదుపాయాలు కార్మికులకు యాజమాన్యం కల్పించవలసి ఉంటుంది.అవి ఏమి పట్టించుకోకుండా యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి.ఆరోగ్య భద్రత కోసం హైపటిటాన్ బి వాక్సినేషన్ , టెటానస్ టీకా అవసరమైన షెడ్యూల్ ప్రకారం అందించాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి, ప్రమాదకరమైన వ్యర్థాలకు గురైనప్పుడు తక్షణ వైద్య చికిత్స అవసరమైనప్పుడు పోస్ట్ ఎక్స్ పోజర్ ప్రోపైలాక్సిన్ చికిత్సలు అందించాలి కాని కార్మికులు అంతటి అదృష్టానికి నోచుకోవడం లేదంటు పలవురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శిక్షణ, పని ప్రదేశ భద్రత కల్పించాలి అదీ ఏదీ లేకుండా ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యం కాలయాపన చేస్తున్నారంటూ చర్చ జరుగుతోంది.రూల్స్,నిబంధనలు,చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోక కార్మికులు కత్తి మీద సాము చేస్తున్నట్టు విధులు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం అవుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్మికులకు జరుగుతున్న అన్యాయం పై విచారణ చేపట్టి యాజమాన్యం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

* యాజమాన్యం వివరణ…….
బయో మెడికల్ వ్యర్థాల సేకరణ, శుద్దీ కరణ కేంద్రంలో కార్మికులకు కల్పించవలసిన భద్రత , సౌకర్యాల వివరాల వివరణకై చరవాణి ద్వారా యాజమాన్యంను కోరగా వారు నిరాకరించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.