జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన జ్వాలాముఖి శక్తిపీఠం, కాంగ్రా జిల్లాలోని బగ్లాముఖి శక్తిపీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, లోకకళ్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని ప్రార్థించారు. ఆలయాల ఆధ్యాత్మిక వాతావరణంలో కొంత సమయం గడిపి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.
హిమాచల్ ప్రదేశ్లోని ఈ రెండు ప్రసిద్ధ శక్తిపీఠాల సందర్శన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
