మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేపు మంథని, మహాదేవపూర్‌లో పర్యటన
రూ.45 కోట్లతో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన..
నూతన ప్రభుత్వ సంగీత కళాశాల ప్రారంభం
4,668 మందికి చేయూత పింఛన్లు.. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మంథని నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 24, ప్రజావాణి:
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నవంబర్ 25న మంథని, మహాదేవపూర్, కాటారం మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా మంజూరైన పింఛన్లు, చెక్కులను పంపిణీ చేయనున్నారు.
మధ్యాహ్నం మహాదేవ్ పూర్ లో…
మధ్యాహ్నం 2 గంటలకు రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన మహాదేవపూర్ నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని, 2.30 గంటలకు నూతన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారు.
కాటారంలో సంక్షేమ పథకాల పంపిణీ:
సాయంత్రం 4 గంటలకు కాటారంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్‌రావు, పలిమెల మండలాల పరిధిలోని 2,204 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లను పంపిణీ చేస్తారు. అదేవిధంగా 73 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేయనున్నారు.
మంత్రి పర్యటనకు సంబంధించి కార్యక్రమాల వివరాలను మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఏ. చంద్రశేఖర్ వెల్లడించారు.

