📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఇందిరమ్మ బీమాతో కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా!

ఇందిరమ్మ బీమాతో కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా!

📰 Generate e-Paper Clip

బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం

18 నుంచి 59 ఏళ్ల వారికి అవకాశం.. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి)

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రారంభమైంది.మండలంలోని గుగ్గిళ్ల, పోతారం, నరసింహులపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రేషన్ కార్డు లేని వారు కూడా నిబంధనల ప్రకారం అర్హత ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక యాప్‌ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల సర్పంచ్ మల్లయ్య, ఉపసర్పంచ్ దూగ్యానీ లావణ్య-మోహన్, వార్డు సభ్యులు కొంకటి సంపత్, కొంకటి సురేష్, ర్యాకం అనిత, పంచాయతీ కార్యదర్శి వంశీ, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.