ఇందిరమ్మ బీమాతో కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా!
బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం 18 నుంచి 59 ఏళ్ల వారికి అవకాశం.. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు బెజ్జంకి, నవంబర్ 23 (ప్రజావాణి) పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రారంభమైంది.మండలంలోని గుగ్గిళ్ల, పోతారం, నరసింహులపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ పథకం ద్వారా...