📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కోతులనడుమకు రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం

కోతులనడుమకు రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ శివాలయం

📰 Generate e-Paper Clip

లింగ సముద్రం చెరువు వద్ద ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన.. త్వరలోనే భూమిపూజ

భిక్షాటన చేసైనా మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తాం- గురుస్వామి కాల నాగ మహర్షి

ఎల్కతుర్తి, నవంబర్ 23 (ప్రజావాణి):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి అరుదైన ఆధ్యాత్మిక భాగ్యం దక్కనుంది. గ్రామంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో శ్రీ పశుపతినాథ్ శివాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించేందుకు గురుస్వామి కాల నాగ మహర్షి సంకల్పించారు. ఈ మేరకు ఆదివారం గ్రామానికి విచ్చేసిన గురుస్వామి కాల నాగ మహర్షి, వారి శిష్యులు స్వామి కాల మహేశ్వర మహర్షి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.గ్రామంలోని జాతీయ రహదారి 563 సమీపంలో ఉన్న లింగ సముద్రం చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన స్వామీజీకి, ఆ ప్రాంతానికి పురాతన కాలం నుంచి శివలింగాలతో ఉన్న ఆధ్యాత్మిక చరిత్రను గ్రామ పెద్దలు వివరించారు. దీంతో స్వామీజీ భావోద్వేగానికి లోనై, ఈ పుణ్యభూమిలో శివాలయ నిర్మాణం చేపట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు, గ్రామస్థులతో స్వామీజీ సమావేశమయ్యారు. అన్ని జిల్లాల ప్రజలు కోతులనడుమ గ్రామం పేరును గుర్తుంచుకునేలా అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అవసరమైతే భిక్షాటన చేసైనా ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తామని, గ్రామస్థులు తమ వంతు సహకారం, ఆశీర్వాదాలు అందించాలని కోరారు.పండితుల సూచనల మేరకు త్వరలోనే భూమిపూజకు శుభ ముహూర్తాన్ని నిర్ణయించి గ్రామస్థుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్వామీజీ వెల్లడించారు. గ్రామానికి దక్కిన ఈ గొప్ప ఆధ్యాత్మిక అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీనివాస్ యాదవ్ సంయుక్తంగా కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీపతి రవీందర్ గౌడ్, శ్రీపతి మొగిలి, శ్రీపతి బిక్షపతి, గోపగోని తిరుపతి, మాట్ల శ్రీనివాస్, మాట్ల రాజయ్య, చిరంజీవి, పల్లెవెన రాజు యాదవ్, పల్లెవెన రవీందర్ యాదవ్, పల్లెవెన ఎర్రయ్య, పల్లెవెన మల్లయ్య, ఎర్రోళ్ల జగన్, ఎర్రోళ్ల చిరంజీవి, ఎర్రోళ్ల సురేష్, ఎర్రోళ్ల రాజయ్య, ఎర్రోళ్ల రాజబాబు తదితర గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.