📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల విడుదలలో పోటాపోటీ

బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల విడుదలలో పోటాపోటీ

📰 Generate e-Paper Clip

*బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర వాల్ పోస్టర్ల విడుదలలో పోటాపోటీ!*

*గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఆహ్వానించకపోవడంపై సర్పంచ్, ఉపసర్పంచ్ ఆగ్రహం*

– ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం సరైన పద్ధతి కాదు: సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్

*మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ప్రసిద్ధ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్ల విడుదల కార్యక్రమం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 22 (ప్రజావాణి ) ఈ నెల 24వ తేదీ పౌర్ణమి నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం వేర్వేరుగా వాల్ పోస్టర్లను విడుదల చేయడం స్థానికంగా వివాదానికి దారితీసింది.

శుక్రవారం బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్‌ను ఆహ్వానించకుండానే జాతర వాల్ పోస్టర్‌ను విడుదల చేసినట్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆదివారం మరో వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకుల సమక్షంలో జాతర ఉత్సవాల వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా దేవాలయ కమిటీ సభ్యులు వాల్ పోస్టర్ విడుదల చేయడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.