📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్రంగసముద్రం పంచాయతీ నూతన శకానికి నాంది పలకండి: కూటమి అభ్యర్థుల విజయమే మన లక్ష్యం –...

రంగసముద్రం పంచాయతీ నూతన శకానికి నాంది పలకండి: కూటమి అభ్యర్థుల విజయమే మన లక్ష్యం – మాజీ ఎంపీటీసీ కలవకూరి రమణ పిలుపు

📰 Generate e-Paper Clip

“అభివృద్ధే ధ్యేయం.ప్రజా సంక్షేమమే మా మార్గం.రంగసముద్రం భవిష్యత్తు కోసం కూటమికే మన ఓటు!

పోరుమామిళ్ల నవంబర్ 22:ప్రజావాణి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కూటమి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం విస్తృతంగా సాగుతోంది.ఈ క్రమంలోనే,రంగసముద్రం పంచాయతీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థిని దాసరపల్లి శ్రీ దివ్యను,అలాగే 14 మంది వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీటీసీ,ప్రస్తుత 8వ వార్డు సభ్యుల అభ్యర్థి కలవకూరి రమణ ఓటర్లకు సుదీర్ఘ పిలుపునిచ్చారు.పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామం,ప్రతి ఇల్లా నిరంతరం పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి ఆయన శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరపల్లి శ్రీ దివ్య విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆమెకు కేటాయించిన బుట్ట గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.విద్యావంతురాలు,నిగర్వి, నిరంతరం ప్రజాసేవకు పరితపించే వ్యక్తిత్వం ఉన్న శ్రీ దివ్యను సర్పంచ్‌గా ఎన్నుకుంటేనే రంగసముద్రం పంచాయతీ రూపురేఖలు మారుతాయని రమణ ధీమా వ్యక్తం చేశారు.గ్రామానికి అవసరమైన సిమెంట్ రోడ్లు, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ,ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పన కేవలం కూటమి ప్రభుత్వ మద్దతుతోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరిస్తున్నారు.8వ వార్డు అభ్యర్థిగా కలవకూరిరమణ గుర్తు ప్రెజర్ కుక్కర్రంగసముద్రం 8వ వార్డు మెంబర్ అభ్యర్థిగామాజీ ఎంపీటీసీ కలవకూరి రమణ స్వయంగా ఎన్నికల బరిలో నిలిచారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన,సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఎన్నికల సంఘంప్రెజర్ కుక్కర్గుర్తును కేటాయించింది. గతంలో ఎంపీటీసీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన రమణ.. ఈసారి కూడా వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ,వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తన ప్రెజర్ కుక్కర్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి,భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.14 మంది వార్డు సభ్యుల ఏకతాటి క్లీన్ స్వీప్ దిశగా అడుగులుపంచాయతీ పరిధిలోని మొత్తం 14 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు అత్యంత సమర్థులని, వీరంతా నిస్వార్థంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చారని కలవకూరి రమణ స్పష్టం చేశారు. పంచాయతీలో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వ నిధులు సక్రమంగా గ్రామానికి చేరాలన్నా సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యుల గెలుపు అత్యంత కీలకమన్నారు. కూటమి అభ్యర్థులందరినీ ఏకపక్షంగా గెలిపించి రంగసముద్రంలో క్లీన్ స్వీప్ సాధించాలని పిలుపునిచ్చారు.ఓటర్లకు కలవకూరి రమణ చేసిన ప్రత్యేక విజ్ఞప్తి:”మన రంగసముద్రం పంచాయతీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేరాలన్నా మనమంతా ఏకతాటిపైకి రావాలి. ఓటర్ల మహాశయులారా.ఆలోచించి ఓటు వేయండి.సర్పంచ్ అభ్యర్థి దాసరపల్లి శ్రీ దివ్య గారి బుట్ట గుర్తుకు ఓటు వేసి గెలిపించండి!8వ వార్డు మెంబర్ అభ్యర్థి కలవకూరి రమణ గారి ప్రెజర్ కుక్కర్ గుర్తుకు ఓటు వేయండి!మన కూటమి తరఫున పోటీ చేస్తున్న 14 మంది వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో విజయతీరాలకు చేర్చండి!”ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. రంగసముద్రం పంచాయతీ వ్యాప్తంగా ప్రస్తుతం “బుట్ట గుర్తు”ప్రెజర్ కుక్కర్ గుర్తు”హవా స్పష్టంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.