📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonమాజీ కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మాజీ కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): స్వేరోస్ ఫౌండర్ చైర్మన్, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం జనగామ పట్టణంలోని 1వ వార్డు మాజీ కౌన్సిలర్, స్వేరోస్ ఫౌండర్ ప్రెసిడెంట్, దళితరత్న కన్నారపు ఉపేందర్ ను ఆయన నివాసంలో పరామర్శించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఉపేందర్ యోగక్షేమాలు కనుక్కొని, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, మనోధైర్యం కోల్పోవద్దని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

స్వేరోస్ ఉద్యమంలో ఉపేందర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తిప్పారపు విజయ్, స్వేరోస్ నాయకులు ప్యాట రాజు, కుటుంబ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.