ఇందిరమ్మ బీమా..
కుటుంబ సభ్యులందరికీ వర్తింప చేయాలి..
సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గౌడ్
ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంను 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి వర్తింపచేయాలని మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బైరు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఒకే వ్యక్తికి వర్తింపచేయడం వలన ఆ వ్యక్తికే బీమా వర్తిస్తుందని, దురదృష్టవశాత్తు కుటుంబంలోని ఇతర వ్యక్తి ఎవరైనా మరణిస్తే సంబంధిత కుటుంబానికి బీమా వర్తించదని, అందుకే కుటుంబానికి మొత్తం వర్తించేలా పథకంలో సవరణ చేయాలని కోరారు.
