📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపాట మాట, నినాదాలతో మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

పాట మాట, నినాదాలతో మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

పాట మాట, నినాదాలతో మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.–

( ప్రజావాణి ప్రతినిధి) నవంబర్ 22

–జవహర్ నగర్ డంపింగ్ యార్డు తొలగింపు కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఎం.పి.ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ డిసిసి వజ్రేష్ యాదవ్ కూడ మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి.
— మొదటి రోజు రిలేదీక్ష కార్యక్రమం విజయవంతం అని ప్రకటించిన జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్.
— మద్దతు ప్రకటించి, దీక్షలో పాల్గొన్న యాంటి డంపింగ్ యార్డు దమ్మాయిగూడ జేఏసి, తదితరులు.
–ఆకట్టుకున్న జాన్, వెంకటాచారి ఉద్యమ పాటలు.

జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎన్నికలలో ఇచ్చిన హామీలో బాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తొలగించి, కొత్త చెత్తను రాంకీ డంపింగ్ యార్డుకు తీసుకురావడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన రిలే నిరాహార దీక్షల మొదటి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ జేఏసి చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ ప్రకటించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, కీసర సర్కిల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని చెన్నాపురం చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో 2026, నవంబర్-22, ఆదివారం రోజున రిలే దీక్షలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు హాజరై, తమదైన శైలిలో పాట, మాట, నినాదాలతో అత్యంత ఉత్సాహ బరితంగా రిలేదీక్షలను ఉత్తెజపరిచి సంఘీభావం తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏళ్లుగా జవహర్ నగర్ ప్రజలు డంపింగ్ యార్డు కాలుష్యంతో నరకం అనుభవిస్తున్నారని, దుర్వాసన, కలుషిత నీరు, విషపూరిత గాలితో పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం మొత్తం చెత్తను ఒకే చోట వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, చెత్తను డిసెంట్రలైజ్ చేసి, నాలుగు మూలలా చిన్నచిన్న ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును శాస్త్రీయంగా మూసివేసే వరకు, కొత్త చెత్త రాకుండా ఆపే వరకు ఈ రిలే దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారని ఇది బాదకరమైన విషయమని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పాత చెత్తను రీసైకిల్ చేసి, యార్డును తొలగించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇటు డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి, అటు దమ్మాయిగూడ జేఏసి వాళ్ళతో కలిసి ఐక్యంగా ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నామని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యాంటి డంపింగ్ యార్డు జేఏసీ దమ్మాయిగూడ నాయకులు, వివిధ పార్టీల, ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రిలే దీక్షలను విజయవంతంగా ముగిశాయని తెలియజేశారు.
సిపిఐ దర్శనం యాదగిరి, నిమ్మల నర్సింహ్మ, సిపిఎం శివన్నారాయణ, కె.సురేందర్, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జయసుధ, సురేందర్, బీఎస్పీ బిర్రు యాకస్వామి, ఆమ్ ఆద్మీ పార్టీ మోఇన్, టిఆర్ఎస్ మేక లలిత యాదవ్, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ వి.ప్రవీణ్, డి.స్వరూప, ఎం.ఎల్.పి.ఐ.(రెడ్ ఫ్లాగ్) ఖాసీం, లింగస్వామి టిజేఎస్ ఎం.శ్రీనివాస్, టిడిపి టి.శ్రీరాములు, టియుజేఏసి ఎ.లలిత, డి.లలిత మరియు యాంటి డంపింగ్ యార్డు దమ్మాయిగూడ జేఏసి సమ్మిరెడ్డి, స్వర్ణ తమ సంపూర్ణ మద్దతును తెలియజేసి, దీక్షలో పాల్గొన్నారు. టియుజేఏసి తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, పిఓడభ్ల్యూ సంధ్య, సిఎంఎస్ సత్య, పికెఎం జాన్, ఐ.ఎఫ్.టి.యు. పి శివబాబు, ఏ.ఐ.ఎఫ్.టి.యు. వై మల్లేష్, పిడిఎం చంద్రమౌళి, సిపిఎం నగేష్, బహుజజన రక్షణ సమితి మహ్మద్ జావేద్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మహ్మద్ పాషామియా, టి.కాలేషా, ప్రజానాట్యమండలి వెంకటాచారి, ఉద్యమ కళాకారుల వేదిక యాదగిరి, మహిళా విబాగం సుజి, పిఓడభ్ల్యూ(విముక్తి) గడిపే సునీత, సిఎంఎస్ జయ, కార్మికనగర్ దామాల ప్రబాకర్, శ్రీనివాస్, పిడిఎం రవి, సిజేపి శ్రావణ్ కుమార్ తదితర సంఘా నాయకులతో పాటు బీఆర్ఎస్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్, ఆలూరి సంగీత, రాజశేఖర్ దీక్షలకు హాజరై సందేశాలు ఇచ్చిన వారిలో ఉన్నారు.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జాన్, వెంకటాచారి కళాకారులు ఆలపించిన ఉద్యమ పాటలు ఆకట్టుకొని, దీక్షలో పాల్గొన్న వారికి ఎంతో ఉత్తేజాన్నిచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.