📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఐక్య పోరాటలతోనే ముదిరాజుల హక్కుల సాధన

ఐక్య పోరాటలతోనే ముదిరాజుల హక్కుల సాధన

📰 Generate e-Paper Clip

*ఐక్య పోరాటలతోనే ముదిరాజుల హక్కుల సాధన*
*జిల్లాలో ఘనంగా ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు*

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

ఐక్య పోరాటాలే ముదిరాజుల హక్కుల సాధనకు మార్గమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెటి తిరుపతి లు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ పెద్దమ్మ గుడి వద్ద ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జెండా ఆవిష్కరించి, ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి లు మాట్లాడుతూ, ముదిరాజుల అభ్యున్నతి, సాధికారత, హక్కుల సాధన, రాజకీయ చైతన్యం కోసం రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మహాసభ వ్యవస్థాపకులు బండ ప్రకాశ్ ఈ సంఘాన్ని స్థాపించారని తెలిపారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలనే ప్రధాన డిమాండ్‌ తో పోరాటం కొనసాగుతోందని, ప్రభుత్వ జాప్యంపై సంఘ పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా జాతి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా, 14 శాతం వాటా కలిగిన ముదిరాజులకు హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం కోసం సంఘాల సంఖ్యను 3 నుంచి 500కు పెంచడంతో పాటు చేపల వృత్తికి అవసరమైన పనిముట్లు, వలలు, ఇతర సామాగ్రి, 62,500 ద్విచక్ర వాహనాలు, 4 వేలు మూడు చక్రాల వాహనాలు, వందలాది వ్యాన్లను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం *యువజన జిల్లా అధ్యక్షుడు గరిగే సుమన్*, నాయకులు గరిగంటి సరోజ, తూటి రమేష్, నూనె రాజేశం, పంబల పోషం, మంద రమేష్, కొలిపాక తిరుపతి, ఐలవేని కన్నయ్య, చుక్క మల్లేష్, షెనవెన పోషం, రాక్వార్ రాజు లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.