📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం..

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం..

📰 Generate e-Paper Clip

*పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం…*

*107 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల అందజేత.*

*అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 22*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజు సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణానికి మంజూరైన 107 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద , మధ్య తరగతి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలి పారు. ముఖ్యంగా సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల అని , ఆ కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. అర్హులైన లబ్ధి దారులను పారదర్శకంగా ఎంపిక చేసి విడతల వారీగా ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్విని యోగం చేసుకొని నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లబ్ధి దారులకు సూచించారు.
భువనగిరి పట్టణ అభి వృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని , నియోజక వర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తో తమ సొంతింటి కల నెరవేరనున్న నేపథ్యంలో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల , మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ , కౌన్సిలర్లు , కో అప్షన్ సభ్యులు , అధి కారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.