📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరైల్వే స్టేషన్ల పరిసరాల్లో విస్తృత తనిఖీలు – నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్

రైల్వే స్టేషన్ల పరిసరాల్లో విస్తృత తనిఖీలు – నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్

📰 Generate e-Paper Clip

రైల్వే స్టేషన్ల పరిసరాల్లో విస్తృత తనిఖీలు – నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్
డోర్నకల్: నవంబర్21 (ప్రజావాణి)
మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు
అనుమానిత వ్యక్తులపై నిఘా.. నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి

గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు

మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పోలీసు బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు, అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానం కలిగించే వ్యక్తులను ప్రశ్నించి, అవసరమైన చోట ఫింగర్ ప్రింట్ డివైజ్‌ల ద్వారా వారి వివరాలను పరిశీలిస్తున్నారు.

ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదకద్రవ్యాల సరఫరా మరియు రవాణాను అరికట్టేందుకు రైల్వే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించే అనుమానితులు, వారి లగేజీపై నిఘా ఉంచుతున్నారు.

అదేవిధంగా రైల్వే స్టేషన్ల పరిసరాల్లో చాలా కాలంగా పార్కింగ్ చేసి వదిలివేసిన వాహనాలను తనిఖీ చేస్తూ, వాటి యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. స్టేషన్ చుట్టుపక్కల ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాలను కూడా పరిశీలిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు.

జిల్లాలో నేరాల నివారణకు నిరంతర పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతాయని, ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.