📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి

సిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి

📰 Generate e-Paper Clip

సిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బహిరంగ క్షేమాపణ చెప్పాలి

మద్దూరు మండల కాంగ్రెస్ సర్పంచుల డిమాండ్

మద్దూరు నవంబర్21, ప్రజా వాణి,

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు బహిరంగ క్షేమాపణ చెప్పాలని మద్దూర్ మండల కాంగ్రెస్ సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మద్దూర్ మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు సుందరగిరి సత్యనారాయణ గౌడ్, ఇట్టబోయిన కనకచంద్రం డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలకే పరిమితం కావాలి.వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మెప్పు పొందాలంటే, అతని మోచేతి నీళ్లు తాగడం కోసం మా ఎంపీ గారిని తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.