పోరుమామిళ్ల,కడప జిల్లా:నవంబర్ 18 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ వైఎస్సార్‌సీపీ కేంద్రమైన పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదంతొక్కాయి.ఇందులో భాగంగా బుధవారం వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైశ్య బజార్ నందు విస్తృత స్థాయి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైశ్య బజార్‌లో అపూర్వ స్వాగతం,ఇంటింటికీ నల్లేరు ప్రచారం వైశ్య బజార్‌కు చేరుకున్న నల్లేరు విశ్వనాథ రెడ్డికి,వైఎస్సార్‌సీపీ నాయకులకు స్థానిక వ్యాపారులు, ప్రజలు,మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.ప్రచారంలో భాగంగా విశ్వనాథ రెడ్డి ప్రతి ఇంటినీ, దుకాణాన్ని సందర్శిస్తూ స్థానిక ప్రజలను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని,సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు.అభివృద్ధి పథంలో పోరుమామిళ్ల: సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలిఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ. పోరుమామిళ్ల మేజర్ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. విద్యావంతురాలు, సేవాతత్పరత కలిగిన శ్రీమతి షేక్ సునీహ సర్పంచ్‌గా ఎన్నికైతే స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పోరుమామిళ్ల మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన పారదర్శక పాలన, సంక్షేమ ఫలాలను గుర్తుంచుకుని, గ్రామ ప్రగతి కోసం ఓటర్లందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. “పోరుమామిళ్ల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న మన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి షేక్ సునీహ కి మీ అమూల్యమైన ఓటు వేసి,అత్యధిక మెజార్టీతో గెలిపించాలి”అని ఆయన ఓటర్లను చేతులు జోడించి అభ్యర్థించారు.స్థానిక ప్రజలు సైతం సానుకూలంగా స్పందిస్తూ సునీహ గెలుపునకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తరలివచ్చిన నేతలు,శ్రేణులు ఎన్నికల ప్రచార జోష్‌తో వైశ్య బజార్ ప్రాంతం అంతా వైఎస్సార్‌సీపీ జెండాలతో, నినాదాలతో హోరెత్తిపోయింది.ఈ భారీ ప్రచార కార్యక్రమంలో పోరుమామిళ్ల మండలానికి చెందిన ముఖ్య నాయకులు,అనుబంధ సంఘాల ప్రతినిధులు,పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు పాల్గొని అభ్యర్థి విజయానికి శ్రమించారు.
పోరుమామిళ్ల అభివృద్ధిే ధ్యేయం: షేక్ సునీహను భారీ మెజార్టీతో గెలిపించండి – వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి పిలుపు!
RELATED ARTICLES

