📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనల్లవల్లి రైతుల భూముల కోసం ఆదర్శ్ రెడ్డి న్యాయపోరాటానికి చేయూత

నల్లవల్లి రైతుల భూముల కోసం ఆదర్శ్ రెడ్డి న్యాయపోరాటానికి చేయూత

📰 Generate e-Paper Clip

నల్లవల్లి రైతుల భూముల కోసం ఆదర్శ్ రెడ్డి న్యాయపోరాటానికి చేయూత

నల్లవల్లి రైతులకు ఊరట.. భూసేకరణపై కోర్టు స్టే”

రైతుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామని వెల్లడి

రామచంద్రపురం, నవంబర్18 (ప్రజావాణి):పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ రైతుల భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి అండగా నిలిచారు. టీజీఐఐసీ చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ తమ వ్యవసాయ భూములను కాపాడుకునేందుకు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు.రైతుల తరఫున న్యాయపోరాటం కొనసాగించేందుకు అవసరమైన న్యాయవాది ఫీజులను ఆదర్శ్ రెడ్డి చెల్లించి సహకరించారు. ఆయన అందించిన సహకారంతో రైతులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించి సంబంధిత భూముల సేకరణ ప్రక్రియను టీజీఐఐసీ ప్రస్తుతానికి నిలిపివేసింది.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న రైతుల భూముల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా న్యాయపరంగా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.