నెల్లికుదురులో ఖేత్ బచావో అభియాన్..
ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురులో ఖేత్ బచావో అభియాన్,ఎల్ నినో ప్రభావం,వేసంగి పంటల సాగు ప్రణాళిక పై రైతులకు వ్యవసాయ శాఖ ఏవో భూక్య మహేందర్ ఆదేశం మేరకు ఏఈఓ సుమలత ఆధ్వర్యంలో సర్పంచ్ పులి వెంకన్న అధ్యక్షతన బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ సుమలత ఖేత్ బచావో అభియాన్ పై అవగాహన కల్పిస్తూ పంట వ్యర్ధాలను కాల్చకుండా ఎరువులుగా మార్చుకోవాలని సూచించారు. ఆర్గానిక్ సాగుపై దృష్టి సారించాలన్నారు.భూసార పరిరక్షణ అవశ్యకత,సేంద్రీయ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత యాసంగి లో సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా వరి పంట ను తగ్గించి ఆరు తడి పంటలు సాగు చేపట్టాలని సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంచాల వెంకన్న గ్రామ రైతులు పాల్గొన్నారు.

